Peddi | స్పెషల్ వెనుక ఏం జరుగుతోంది…?
Peddi | స్పెషల్ వెనుక ఏం జరుగుతోంది…?
Peddi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ పెద్ది. బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న పెద్ది.. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అయితే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ ఎవరితో చేయించనున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరుకు కొంత మంది భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. మృణాల్ తో ఈ స్పెషల్ సాంగ్ చేయించనున్నట్టుగా ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఇప్పుడు మృణాల్ షాక్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఏమైంది..? పెద్ది స్పెషల్ సాంగ్ ఎవరితో..?

Peddi | అందుకే నో చెప్పిందా…?
పెద్ది ఈ స్పెషల్ సాంగ్ తప్పితే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యిందట. ఈ సాంగ్ ను స్పెషల్ గా డిజైన్ చేశాడట బుచ్చిబాబు. చాలా మంది హీరోయిన్స్ ను అనుకుని పైనల్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ ఫైనల్ చేశారట. అయితే.. ఏమైందో ఏమో కానీ.. మృణాల్ లాస్ట్ మినిట్ లో నో చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల ప్రకారం, కథలో తన పాత్ర ప్రాధాన్యతకు సరిపడని ఈ సాంగ్ చేయడానికి ఆమె ముందుకు రాలేదనే ప్రచారం సాగుతోంది. తన కెరీర్ కి మైనస్ అవుతుందని అనుకుందేమో నో చెప్పిందట. దీంతో చిత్ర యూనిట్‌కు ఇది ఒక షాక్‌గా మారిందని అంటున్నారు సినీ జనాలు.

Peddi | మృణాల్ ప్లేస్ లో సంయుక్త..?
ఇదే సమయంలో, ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పుడు సంయుక్త మీనన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇటీవల వరుస హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న సంయుక్త మీనన్, ఈ పాటకు గ్లామర్‌తో పాటు ఎనర్జీ తీసుకురాగలదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. పెద్ది సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న నేపథ్యంలో, స్పెషల్ సాంగ్ కూడా కీలక ఆకర్షణగా మారే అవకాశముంది. అందుకే.. ఈ పాట కోసం చిత్రబృందం జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటోందని సమాచారం. అయితే, మృణాల్ నిజంగా ఆఫర్‌ను తిరస్కరించిందా? లేక ఇది కేవలం రూమర్ మాత్రమేనా? సంయుక్త మీనన్ ఫైనల్ అయ్యిందా? అనే విషయాల పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటి వరకు ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా కొనసాగనున్నాయి.

