ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం…

ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం…
నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు మున్సిపాలిటీకి చెందిన చిత్రకారుడు డా.దేశెట్టి శ్రీనివాస్ తన రక్తంతో సీఎం చంద్రబాబు చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ, రాష్ట్ర రాజధాని అమరావతి ప్రగతికి అహర్నిశలు శ్రమిస్తున్న మీలాంటి నాయకత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు అనుక్షణం పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
