జర్నలిస్టు వెలగందుల అజయ్‌కు పితృవియోగం

కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్‌కు చెందిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు వెలగందుల అజయ్ కుమార్ తండ్రి సాంబయ్య (65) గుండెపోటుతో ఈ నెల 18న కేరళలో మృతి చెందారు. సోమవారం ఆయన భౌతిక దేహం నగరంలోని ఉరుసు ప్రాంతంలోని స్వగృహానికి చేరింది.

విషయం తెలిసిన వెంటనే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా జర్నలిస్టులు అక్కడికి చేరుకుని మృతదేహంపై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మృతుడు సాంబయ్యకు భార్య, కుమారుడు అజయ్ కుమార్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ వర్గాల ప్రముఖులు కూడా ఆయన భౌతిక దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Leave a Reply