TG | కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

TG | కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఘన స్వాగతం పలికిన మంత్రులు

TG | మహాదేవపూర్, ఆంధ్రప్రభ: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. సరస్వతి ఘాట్ వద్ద రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. వారి వెంట మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్ర‌భాక‌ర్ , ఎన్ డీఎస్ ఏ ఛైర్మ‌న్ అనిల్ జైన్ వున్నారు.

ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం అందజేశారు. అనంతరం సీఎం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ శుభానంద (పార్వతి) అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలతో సీఎంను సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు తీర్థప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు. సీఎం రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

Leave a Reply