కాటారం సభ ఏర్పాట్లపై ఎంపీ వంశీకృష్ణ పర్యవేక్షణ
కాటారం, ఆంధ్రప్రభ : కాటారం మండలంలోని నస్తూర్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు.
సీఎం సభ విజయవంతం కావడానికి అవసరమైన వేదిక నిర్మాణం, ప్రజల కూర్చొనే సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం సభ ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించి, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
