మార్లవాయిలో ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళులు

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాజైనూర్ మండలం, మార్లవాయి గ్రామపంచాయతీలో సోమవారం ఇంద్రవెల్లి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి వారిత్యాగాలను ఘనంగాస్మరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఏప్రిల్ 20ను ఆదివాసుల అమరవీరుల దినోత్సవంగానిర్వహించుకుంటూ, “జల్, జంగల్, జమీన్” అనే పోరాట స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిదేనని పేర్కొన్నారు. ఆదివాసుల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడాలనిపిలుపునిచ్చారు. ఇంద్రవెల్లి సంఘటన చరిత్రను స్మరించుకుంటూఅమరవీరుల సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, వార్డు సభ్యులు, కనక భరత్, సోయం రాజు, తుంరం సీత, కొడప పుల్లబాయి, ధైర్యవంతి, అంగన్వాడీ టీచర్ కొడప నెత్తుబాయి, ఆశా వర్కర్ ఆడ చంద్రకళ, వివో ఏ సోయం సీత, గ్రామస్థులు కొడప లచ్చు, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
