కోడూరులో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కోడూరు వంతెన సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నియోజవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేశారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు మిఠాయిలు పంచి భారీ బాణాసంచా కాల్చారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా బండే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కనపర్తి శ్రీనివాసరావు ప్రారంభించి మొదటి రోజు మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉల్లిపాలెం, విశ్వనాధపల్లి పిఎసిఎస్ చైర్ పర్సన్ లు బొలిశెట్టి విటల్ రావు, తోట సాంబశివరావు, విశ్వనాథపల్లి గుడి చైర్మన్ తోట సూర్య నరసింహారావు, నీటి సంఘాల అధ్యక్షులు అప్పికట్ల రవీంద్రబాబు,బొలిశెట్టి వెంకటేష్, మద్దూరి కాంతారావు, గాదె భాస్కరరావు, పూత బోయన శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ సముద్రాలు, కడవకొల్లు నాంచారయ్య, జాన్ విల్సన్, మహమ్మద్ ఇమ్రాన్, మోర్ల మాణిక్యాలరావు వేముల వేలాద్రి తాత పోతురాజు బావి శెట్టి సురేష్ మనోహర్ దావు మళ్లీ తో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Leave a Reply