130 people | గాంధీక్షేత్రంలో వ్యాస రచన పోటీలు

130 people | గాంధీక్షేత్రంలో వ్యాస రచన పోటీలు

వివేకానందుని బోధనలు నేటితరం తెలుసుకోవాలి

  • నియోజకవర్గ యువనాయకులు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్

130 people | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : యువతకు ఉత్తేజం కలిగించే వివేకానందుని బోధనలు నేటితరానికి తెలియచెప్పటమే తమ సంకల్పం అని నియోజకవర్గ యువనాయకులు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ తెలిపారు. సోమవారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో “స్వామి వివేకానంద జీవితం – సందేశం” అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు.

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ పునర్నిర్మాత స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలలో భాగంగా నిర్వహించిన ఈ పోటీలలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 130మంది పాల్గొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు గుడిసేవ విష్ణుప్రసాద్, కూనపరెడ్డి చంద్రశేఖర్, కే.సముద్రాలు, అధ్యాపకురాలు డాక్టర్ ఏ.వీరకుమారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

130 people |

శితి కంఠానంద రాక‌…

ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించే సభకు ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ముఖ్య వక్తగా విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి శితి కంఠానంద మహారాజ్ విచ్చేయనున్నట్లు వెంకట్రామ్ తెలిపారు.

130 people |

CLICK HERE TO READ MORE : Intermediate | సూత్రాలు పాటించండి విజయం సాధించండి..

CLICK HERE TO READ MORE :

Leave a Reply