TG | ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ జర్నీ

TG | ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ జర్నీ
TG | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సిటీలో ప్రయాణమంటేనే ట్రాఫిక్ జాంలు, గంటల తరబడి నిరీక్షణ.. వీటన్నింటికీ ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సర్కార్, ఇప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు సహా అందరికీ ఉచిత ప్రయాణాన్ని అందించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా జూన్ 2 నుంచి ఈ సరికొత్త పథకాన్ని పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అమలుచేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు చెక్ పెట్టేలా ఈ నిర్ణయం దోహదపడనుంది. ఈ ఏడాది జూన్ 2 నుంచి పథకాన్ని అమలుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు ఏడాదికి రూ.10 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రయాణికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రస్తుత ఆదాయాన్ని ఇస్తామని ప్రభుత్వం ఎస్సీఆర్ సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం ఎంవోయూను పరిశీలించి రైల్వేబోర్డు అనుమతి తీసుకుంటామన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
