కేశినేని చిన్ని ‘ప్రజాదర్బార్’కు జననీరాజనం.

కేశినేని చిన్ని ‘ప్రజాదర్బార్’కు జననీరాజనం.

42వ డివిజన్‌లో జరిగిన 18వ ప్రజాదర్బార్..
ప్రజల వినతులు స్వీకరించిన రాష్ట్ర అధికార..
ప్రతినిధులు డూండి రాకేష్, ఎం.ఎస్. బేగ్..
సమస్యల పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలు..

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం 42వ డివిజన్ పరిధిలో నిర్వహించిన 18వ ప్రజాదర్బార్ కు బాధితులు, సామాన్య ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎంపీ చిన్ని ప్రాతినిధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు,ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక్కడే..

ఈ ప్రజాదర్బార్‌లో ప్రధానంగా నివేశన స్థలాలు, రేషన్ కార్డులు, సామాజిక పింఛన్లు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతి పత్రాలను అందజేశారు. వినతులు స్వీకరించిన అనంతరం అతిథులు అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా, సకాలంలో పరిష్కారం చూపాలంటూ గట్టిగా ఆదేశించారు.

ప్రజల మనిషి – కేశినేని చిన్ని..

ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని చిన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని,. నియోజకవర్గ అభివృద్ధికి తోడు, సామాన్యుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ 18 ప్రజాదర్బార్‌లను నిర్వహించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం అని పేర్కొన్నారు.

అనంతరం ఎం.ఎస్. బేగ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారని, ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా ఈ వేదికను తీర్చిదిద్దారు అని కొనియాడారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలు తమ గోడు వినేవారు దొరికారని సంతోషం వ్యక్తం చేస్తూ, ఎంపీ చిన్నికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ sc సీనియర్ నాయకులు కామ దేవరాజ్, క్లస్టర్ వై రామయ్య, బీసీ సెల్ ప్రెసిడెంట్ శివాజీ ముదిరాజ్, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పితాని పద్మ, మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ సయ్యిద్ అలీ, ఐటీడీపీ చైతన్య, 42 డివిజన్ ప్రెసిడెంట్ పత్తి నాగేశ్వరావు,ప్రధాన కార్యదర్శి పచ్చవా మల్లికార్జున, డివిజన్ కమిటీ సభ్యులు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply