గోన్ గొప్పుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : గోన్ గొప్పుల గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు గ్రామ సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. భీంగల్ మండలం గోన్ గొప్పుల గ్రామ సర్పంచ్ చేపూరి చరణ్ గౌడ్ శనివారం హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా, పూలమాలలతో సత్కరించారు. గ్రామ అభివృద్ధికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం ఎంతో ఉపయోగకరమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నాయకులు భోజ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply