ప్రజా సమస్యలపై ప్రభుత్వాల నిర్లక్ష్యం: సీపీఐ విమర్శలు

మునుగోడు, ఆంధ్రప్రభ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయని సీపీఐ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం విమర్శించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో “ఇంటింటికి సీపీఐ” కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమం, భూమి, గృహ సమస్యల పరిష్కారానికి సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ చరిత్ర, పోరాటాలను ప్రజలకు వివరించి విరాళాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యుడు సురిగి చలపతి, మండల కార్యదర్శి చాపల శ్రీను, మండల కార్యవర్గ సభ్యులు ఈదులకంటి కైలాస్, గ్రామ శాఖ కార్యదర్శి తాటికొండ సైదులు, సహాయ కార్యదర్శి చింతల వెంకటయ్య, వార్డు సభ్యురాలు ఎరుకొండ భాగ్యలక్ష్మి, నగేష్, పులకరం పాపయ్య, మేడి చంద్రయ్య, పులకరం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
