3 km | గత వారం రోజులుగా…

3 km | గత వారం రోజులుగా…
భయాందోళనలో భక్తులు..
3 km | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సాక్షి గణపతి ఆలయం వద్ద శనివారం వేకువ జామున పెద్దపులి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నా సాక్షి గణపతి ఆలయం పరిసరాలలో ఇటీవల కాలంలో గత నాలుగు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తుంది అని భక్తులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈరోజు పెద్దపులి సంచారంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. దేవస్థానానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అటవీ శాఖ అధికారులకు భక్తులు ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేశారు. గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో రాత్రి సమయాలలో ప్రతిరోజు క్రూర మృగాలు సంచరిస్తున్నాయనీ, ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందో అని భయకంపితులమవుతున్నామని భక్తులు వాపోతున్నారు.

వేసవి కాలం కావటంతో అటవీ ప్రాంతంలో త్రాగేందుకు నీరు లేక వన్యప్రాణులు మానవులు నివసించే నివాస గృహాల దగ్గరికి రావడం విశేషం. అటవీశాఖ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. సాక్షి గణపతి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
CLICK HERE TO READ MORE : ఘనంగా పోలీస్ స్టేషన్లు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్..
