ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం…

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం…

  • రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • కడియం శ్రీహరి

చిలుపూర్, ఆంధ్రప్రభ : రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. చిలుపూర్ మండలం రాజవరం, చిన్న పెండ్యాల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతు నష్టపోవద్దన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదలకు ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిలుపూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఆర్డీవో వెంకన్న, డీఆర్‌డీఏ పీడీ నూరోద్దీన్, తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయ శాఖ అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply