ఘనంగా పోలీస్ స్టేషన్లు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్..

ఘనంగా పోలీస్ స్టేషన్లు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్..
మనం పనిచేసే చోట పరిశుభ్రమైన వాతావరణం..
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఏపీలోని ప్రతి 3వ శనివారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ ఏర్పాటు చేయాలన్నరాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి హరీష్ కుమార్ ఉత్తర్వులతతో, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లు పోలీస్ కార్యాలయాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ నిర్వహించరు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్ బి, స్పెషల్ బ్రాంచ్, పాస్పోర్ట్ కార్యాలయం, సైబర్ క్రైమ్, ఫ్యాక్షన్ జోన్ కార్యాలయాలు, సాయుధ బలగాల కార్యాలయాలు, మోటార్ వెహికల్ కార్యాలయం, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు కార్యాలయాలు, చుట్టు పక్కల ప్రాంగణాలను సమగ్రంగా పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మొక్కలను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… విధులు నిర్వహించే చోట వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా పనిచేసే చోటా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని తద్వారా అనారోగ్య సమస్యలు అనగా డెంగ్యూ, మలేరియా విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, పోలీసులు సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొన్నారు.
