బిచ్కుంద ఎక్సైజ్ సీఐపై ఏసీబీ సోదాలు….

బిచ్కుంద, ఆంధ్రప్రభ : బిచ్కుంద మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ సీఐ సత్యనారాయణపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కేంద్రంలోని ఆయన అద్దె నివాసంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఎక్సైజ్ శాఖ పరిధిలోని మత్తు పదార్థాల కేసులో సుమారు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే కార్మికుల లైసెన్స్‌కు సంబంధించిన వ్యవహారంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో నిర్వహించే పత్రికా సమావేశంలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
