బైపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు..

బైపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు..
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజవర్గం 61 వ డివిజన్ ప్రశాంతినగర్ కు చెందిన టీడీపీ నాయకుడు పసుపులేటి గోపాల్ కుమార్తె జ్యోతిర్మయి బెంజ్ సర్కిల్ దగ్గర అన్ అకాడమీ కాలేజీ నందు బైపిసి ఫస్ట్ సంవత్సరం లో రాష్ట్ర ద్వితీయ ర్యాంకు సాధించింది.
ఈసందర్భంగా సింగ్ నగర్ సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ శ్రేణులు సమక్షంలో ఆ విద్యార్థిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఆకుల సూర్యప్రకాష్, పసుపులేటి గోపాల్, వీరాస్వామి, శివకుమారి తదితరులు పాల్గొన్నారు.
