గురుకులాల్లో ఇంటర్ ఫలితాలలో 88 శాతం ఉత్తీర్ణత..

గురుకులాల్లో ఇంటర్ ఫలితాలలో 88 శాతం ఉత్తీర్ణత..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. జిల్లా కో-ఆర్డినేటర్ వై. యశోద లక్ష్మి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రథమ సంవత్సరంలో 566 మంది విద్యార్థులకు గాను 496 మంది ఉత్తీర్ణులై 88 శాతం ఫలితాలను సాధించారు.

ఇందులో ఎల్. గోవింద్ (బైపీసీ) 440/460, లింగాల రేష్మ, పొట్నూరు చరణ్ కుమార్ (ఎంపీసీ) 462/470, టి. దీపిక (సీఈసీ) 456/500 మార్కులు సాధించి తమ గ్రూపుల్లో జిల్లా టాపర్లుగా నిలిచి ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 591 మందికి గాను 517 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, అల్లాడ సోనియా (బైపీసీ-977/1000), కొప్పిలి జగదీష్ (ఎంపీసీ-973/1000), కోనారి గీతా లక్ష్మి (సీఈసీ-850/1000) అత్యధిక మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు.

ముఖ్యంగా దుప్పలవలస, పెద్దపాడు, కొల్లివలస, నందిగాం, తామరపల్లి గురుకులాలకు చెందిన విద్యార్థులు టాపర్లుగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన అధ్యాపక బృందాన్ని జిల్లా కో-ఆర్డినేటర్ అభినందించారు. ప్రభుత్వ గురుకులాల్లో నాణ్యమైన విద్య అందుతోందని ఈ ఫలితాలే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply