అనర్హుల తొలగింపు కోరుతూ కలెక్టర్‌కు వినతి…

అనర్హుల తొలగింపు కోరుతూ కలెక్టర్‌కు వినతి…

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా అక్రిడిటేషన్ కమిటీలో అనర్హులను చేర్చిన అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, టి.డబ్ల్యూ.జే.ఎఫ్ వనపర్తి జిల్లా కమిటీ తరఫున జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా కొంతమంది అనర్హులను కమిటీలో చేర్చినట్లు పేర్కొన్నారు. ఒకేసారి న్యాయవాద వృత్తి నిర్వహిస్తూ జర్నలిస్టులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు కమిటీలో స్థానం కల్పించడం తగదని తెలిపారు.

అలాగే ప్రభుత్వ దూరదర్శిని సంస్థలో వేతనం పొందుతూ పనిచేస్తున్న వ్యక్తులను కూడా సభ్యులుగా చేర్చడం న్యాయసమ్మతం కాదని అభిప్రాయపడ్డారు. ఇంకా, కొంతమంది జర్నలిస్టు సంఘ నాయకులు తమ అనుచరులకు ప్రాధాన్యత కల్పించేందుకు రాజకీయ ఒత్తిడులు తెస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, జర్నలిజం గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలో జర్నలిస్టుల ప్లాట్ల విషయంలో జరిగిన అవకతవకలను కూడా గుర్తుచేస్తూ, అర్హులైన వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి.డబ్ల్యూ.జే.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అంబటి స్వామి, ప్రధాన కార్యదర్శి గంగవరం రామకృష్ణారెడ్డి సమక్షంలో జిల్లా బృందం పాల్గొని వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.

Leave a Reply