నేస్తం బడికి రా కార్యక్రమం ర్యాలీ

నేస్తం బడికి రా కార్యక్రమం ర్యాలీ
ఘంటసాల, ఆంధ్రప్రభ : నేస్తం బడికి రా కార్యక్రమం ర్యాలీని ఘంటసాల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ముద్దు.. ప్రైవేట్ పాఠశాల వద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ ఎన్.శివశంకర్ రావు మాట్లాడుతూ.. సకల సౌకర్యాల నిధి మన ప్రభుత్వ బడి అన్నారు. 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు, ప్రతి విద్యార్థికి ఏడాదికి 13 వేలు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు ప్రతి రోజు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్ తో పాటు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీరంగవల్లి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
