అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన– మంత్రి వివేక్

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన– మంత్రి వివేక్

చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలతో పాలన సాగిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో స్థానిక అంబేద్కర్ ఉత్సావ సమితి ఏర్పాటు చేసిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రగించారు. తోలుత మంత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై కృషి చేసారని, దేశ స్వాతంత్ర్య సమయంలో స్వాతంత్రం కావాలని కొట్లాడుతుంటే అంబేద్కర్ దళితులకు స్వాతంత్ర కావాలని పోరాటం చేసారని ఆయన సేవలు కొనియాడారు. అనంతరం ఉత్సవ సమితి ఆధ్వరంలో మహిళలకు చీరాల పంపిణీ చేసి, పోలీసుల ఆధ్వర్యంలో “అలైవ్ అరైన్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా ప్రమాణం చేయించారు.

Leave a Reply