కొనుగోలు కేంద్రాలలోని వరి ధాన్యం విక్రయించాలి

కొనుగోలు కేంద్రాలలోని వరి ధాన్యం విక్రయించాలి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే రైతులు ధాన్యం విక్రయించాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సాపురం జీవన్ అన్నారు. మండలంలోని చేంగల్, రూపుల తాండ, ఎంజీ తాండ, గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా ఏఈఓ స్నేహ హాజరై గ్రామ సర్పంచ్ దుమాల మమత (రాజు) స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వరి ధాన్యాన్ని కడతా లేకుండా కొనుగోలు చేస్తూ మరియు మద్దతు ధర అందిస్తూంది అన్నారు. దాలరులను నమ్మి వరి ధాన్యాన్ని అమ్మి రైతుల మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని అన్నారు.

సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన వారి కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ మోత శ్రీనివాస్, సొసైటీ సీఈవో రవి, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు జనార్ధన్ అశోక్, రమేష్, సర్దార్, గణేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూతుల రమేష్, అడపా రాజేశ్వర్, నూతుల వసంత్, శోభన్ గౌడ్, ఆనంద్ గౌడ్,తూర్పు శ్రీధర్,గిర్ని నర్సారెడ్డి, ప్రశాంత్ గౌడ్ లింబాద్రి, రైతులు, యువజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply