వరంగల్‌లో విషాద ఘటన

వరంగల్‌లో విషాద ఘటన
- బావిలో మునిగి యువకుడి మృతి
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్లోని ఉరుసు గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట ఉన్న బావిలో నిన్న సాయంత్రం నీటిలో మునిగిన యువకుడి మృతదేహాన్ని నేడు ఉదయం డిఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి.
ఈ నెల 13న ఆకునూరి మనీష్ తన స్నేహితులు అజయ్, రామ్ చరణ్, పూర్ణచందర్‌లతో కలిసి ఉరుసు బైపాస్ రోడ్ వద్ద ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో స్నేహితుల్లో ఒకరు నీటిలో మునిగిపోవడంతో, మిగతా ముగ్గురు భయంతో రోడ్డు మీదకు పరుగెత్తుకొచ్చారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం నుంచి బావిలో మునిగిన యువకుడి కోసం డిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా, కొద్దిసేపటి క్రితం మృతదేహం లభ్యమైంది.
మృతుడు ఆకునూరి మనీష్‌గా గుర్తించారు. అతను కరీమాబాద్‌కు చెందిన ఆకునూరి రాజేందర్ కుమారుడని మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
