ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం…

ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల ప్రభంజనం…
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన యజమాన్యం
జనగామ, ఆంధ్రప్రభ : ఇంటర్ ఫలితాలలో జనగామ జిల్లా కేంద్రంలోని ఎబివి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడంపై యజమాన్యం హర్షం వ్యక్తం చేసింది ఆదివారం ఉదయం ఇంటర్ ఫలితాలను ప్రకటించిన వెంటనే ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల యజమాన్యం అభినందించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కనకరాజు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎం పి సి మొదటి సంవత్సరం విభాగంలో చిరుచునగండ్ల వర్షిత, సిరికొండ వెంకటేష్ 466/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్, దొంతుల హాసిని 465/470, దేవర బోయిన సాత్విక్, కావటి సిద్దు 464/470, బైరగోని మధురిమ, సందెనబోయిన సాహితీ, బాలింగల హర్షవర్ధన్ 463/470 మార్కులు, బై పి సి మొదటి సంవత్సరం విభాగంలో బానోతు తేజస్వి 436/440, మారపాక అఖిల 435/440, సి ఇ సి మొదటి సంవత్సరం విభాగంలో అయేషా సాదియా 481/500, ఒకేషనల్ విభాగంలో యాంగల్ల సిరి 461/500 మార్కులు సాధించారు అని తెలిపారు.
ద్వితీయ సంవత్సరంలో ఎం పి సి ద్వితీయ సంవత్సరం విభాగంలో మీసాల సాయి నిఖిల్ 991/1000, మోటికే మౌణ్యశ్రీ 990/1000, బై పి సి ద్వితీయ సంవత్సరం విభాగంలో బానోతు ఆశ 984/1000, రాపాక అర్చన 982/1000 సి ఇ సి ద్వితీయ సంవత్సరం విభాగంలో తూర్పాటి చరణ్ 965/1000, ఒకేషనల్ విభాగంలో భారతాల చంటి శ్రీశాంత్ 983/1000 మార్కులతో ప్రభంజనం సృష్టించారు అని తెలిపారు.
గత అనేక సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాల్లో ఏబీవీ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటు తున్నారని ,విద్యార్థుల పట్టుదల ,అధ్యాపకుల కృషి మరువరానిదని అన్నారు. ఇంతటి ఫలితాలను సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ కనకరాజు, శ్రీనివాస్, అధ్యాపకుల బృందం అభినందన తెలియజేశారు.
