సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి

సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని, విరమణ అనంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని ఎస్ టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరవి సుధాకరాచారి పిలుపునిచ్చారు. తొర్రూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు సిహెచ్ ప్రభాకర్ రావు పదవీ విరమణ కార్యక్రమం మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఎస్టీయూ సంఘ ప్రతినిధులు, సహచర ఉపాధ్యాయులు,స్థానికులు శాలువాలు,పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

హెచ్ ఎం జెల్ల లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సుధాకరాచారి మాట్లాడుతూ పదవి విరమణ ఉద్యోగానికి మాత్రమేనని శేష జీవితం కుటుంబంతో గడిపేందుకు, సామాజిక సేవకు అంకితం చేయాలని కోరారు. ప్రభాకర్ రావు అంకితభావం గల ఉపాధ్యాయుడు అని, విధి నిర్వహణలో క్రమశిక్షణగా మెలిగేవాడని తెలిపారు. ఉద్యోగ ధర్మాన్ని మూడు దశాబ్దాలకు పైగా త్రికరణ శుద్ధితో నిర్వహించారని గుర్తు చేశారు.అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయులను విద్యార్థులు, ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు.

ఉపాధ్యాయుడు పేద బిడ్డల అభ్యున్నతికి కృషి చేయాలని, ఆ కోవలోనే ప్రభాకర్ రావు అంకితభావంతో పనిచేశాడని కొనియాడారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, మండల శాఖ బాధ్యులు శ్రీనివాస్ ప్రతినిధులు చంద్రమౌళి,సంపత్, హైమావతి,లక్ష్మణరావు, భాగ్యలక్ష్మి ,రజిత దేవీ, సీనియర్ ఉపాధ్యాయుడు బ్రహ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply