ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన…

ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన…
- గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరం సేవలు అందించడం అభినందనీయం…
- ఉచిత శిబిరంలో సుమారు 350 మందికి పరీక్షలు, మందులు పంపిణీ..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఉచిత మెగా హెల్త్ క్యాంపు కు విశేష స్పందన గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిభిరాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని గ్రామ సర్పంచ్ మోతిలాల్ అన్నారు. ఆదివారం శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ అలాగే పిల్లల హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భీమ్‌గల్ మండల కేంద్రంలోని కారేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం గ్రామస్తుల కోరిక మేరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
శివ సాయి ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కారేపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ మెగా క్యాంప్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరపాలని జరపడానికి తన వంతు కృషి కూడా చేస్తానని అన్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ హెల్త్ మెగా క్యాంపును కారేపల్లి గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామస్తులు ఆర్మూర్, నిజామాబాద్ వెళ్లకుండా మా ఆస్పత్రికి వస్తున్న గ్రామ గ్రామస్తులకు అన్ని విధాలుగా పరీక్షలు చేయడంతో నమ్మకంతో వైద్య పరీక్షలు చేయించుకుంటారని అన్నారు.

ఉచిత మెగా హెల్త్ క్యాంపులో సుమారు 200 మంది పెద్దవారికి 150, మంది పిల్లలకు వైద్య పరీక్షలు అలాగే ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. భీమ్‌గల్ మండలంలోని ప్రతి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుంధన్నారు, ఇలాంటి క్యాంప్ ద్వారా చిన్నచిన్న సమస్యలను పరిష్కరించ వచ్చు పెద్ద సమస్య ఎదురైతే దానికి తగ్గట్టుగా పెద్ద లెవెల్లో కూడా హెల్ప్ చేయడానికి వీలవుతుందని అన్నారు.

ఆర్థిక సహాయం ఎంత చేసినా కలగని ఆనందం పదిమంది ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే డాక్టర్ లు ప్రజాసేవ చేయాలనే ఆలోచన కలగడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు జి. సూర్యనారాయణ ఎండి.ఎంఎస్. జర్నల్ సర్జరి& ఫిజీషియన్, డాక్టర్ వి.జైపాల్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల, కే.హైందవి, ఎం ఎస్. ఓబిజి గర్భిణీ స్త్రీ లకు సేవలందిస్తున్న వైద్యురాలు, ఉప సర్పంచ్ ధరావత్ రాజేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్, మాజీ సర్పంచ్ వాసు, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, రమేష్, ఆసుపత్రి సిబ్బంది షాబుద్దీన్, ప్రకాష్, రాజు, అలం, అదనాన్, రమ్య,నందిని, మౌనిక, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ, గ్రామ, కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

