ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ..

భీంగల్ రూరల్, ఆంధ్రప్రభ : గోనుగొప్పుల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను నిజామాబాద్‌కు చెందిన లక్ష్మీ చేయూత సేవా సంస్థ అందజేసింది. ఈ సందర్భంగా త్వరలోనే పాఠశాలకు జిరాక్స్ మిషన్‌ను కూడా అందజేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ చేయూత సేవా సంస్థ సెక్రటరీ ఎస్. శ్రీనివాస్, క్యాషియర్ ఏ. లక్ష్మణ్, సభ్యుడు టీ. శ్యామ్ కుమార్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చరణ్ గౌడ్, విద్యా శ్రేయోభిలాషులు ఎస్‌ఆర్ భూమేశ్వర్, ఎన్. బోజా గౌడ్, గట్టు భూమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, పాఠశాల బృందం లక్ష్మీ చేయూత సేవా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సేవాభావం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని కొనియాడారు.