ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు

ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు

  • దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట పట్టణంలోని సంగమేశ్వర మందిరంలో దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారిని సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply