అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగింపు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను మున్సిపల్ కౌన్సిలర్ గౌండ్ల అనంతలక్ష్మి విజయేందర్ గౌడ్ పర్యవేక్షిస్తున్నారు.
గత కొంతకాలంగా కాలనీలో డ్రైనేజీ పనులు సరిగా సాగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన కౌన్సిలర్ అనంతలక్ష్మి విజయేందర్ గౌడ్, విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులను వేగవంతం చేయించారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.
