City | కొనసాగుతున్న కూల్చివేతలు
City | కొనసాగుతున్న కూల్చివేతలు
City | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల మీద పంజా విసురుతోంది. కబ్జా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తోంది. ఇప్పటికే నగరంలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కూడా హైడ్రా కాపాడింది. అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలోని ఆక్రమణలపై చర్యలు తీసుకుంటోంది. గత రెండు రోజులుగా ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. నిన్నటి నుంచి ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా అధికారులు కె.ఎ.రెసిడెన్సీ భవనాన్ని కూల్చివేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం వరకు ఈ భవనం నేలమట్టమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, కేఏ రెసిడెన్సీ, క్రిస్టల్ డెవలపర్స్ భవనాల్లో ఉండే వారిని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండు భవనాల్లోని 45 ప్లాట్లలో అద్దెకు ఉంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నఫళంగా ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలంటూ బోరుమంటున్నారు. ఇక సర్వే నంబర్ 171, 172, 173, 174, 175, 212, 213 లో రెండుకరాల్లో నిర్మించిన న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

