12thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

12thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
12thAprilCartoon |రోబో సినిమా నుంచి రియల్ వరల్డ్ ఏఐ వరకు
స్వతంత్రంగా ఆలోచించే కృత్రిమ మేధ ప్రమాదమా?
అంత్రోపిక్ AI పై భయాలు ఎందుకు?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మీకు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమా గుర్తుంది కదా! అందులో చిట్టి పాత్ర? ఇప్పుడు ఏ ఐ చిట్టి అప్‌గ్రేడెడ్ వర్షన్ దశలో ఉన్నట్టనిపిస్తోంది…లేదా ఆ దశకు చేరుకోవడానికి ఎంతో దూరం లేదనిపిస్తోంది.
ఎందుకంటే అంత్రోపిక్స్ అనే అంకుర సంస్థ రూపొందించిన కృతిమ మేధ నిర్వాకం చూస్తుంటే భయమేస్తుంది. మనక్కాదు స్వయంగా ఆ ఏ ఐ ని రూపొందించిన అంత్రోపిక్స్ సంస్థకే గుండెల్లో గుబులు మొదలైందట. ఇంతకీ ఎందుకో తెలుసా? ఆ ఏఐ చేసిన, చేయబోతున్న, చేయగలిగిన గొప్ప ఘనకార్యం ఏమిటో తెలుసా? నిజంగా ఇది ఘనకార్యమే కానీ, అది గనక తప్పుడు పనులు చేసేవారి చేతిలో పడితే ఇంకేమైనా ఉందా? ఇంతకీ విషయమేమిటి? అంటారా? ఆగండి…అక్కడికే వస్తున్నాం.
ఇప్పటి వరకూ మనం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తోంది కదా, కానీ ఈ అంకుర సంస్థ రూపొందించిన సరికొత్త వెర్షన్, మన ఆదేశాలతో పనిలేకుండానే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందట…చెలరేగిపోతుందట…వామ్మో ఇంకేమైనా ఉందా? అప్పుడు దీన్ని ఆప తరము ఎవరికైనా సాధ్యమేనా? ఎంత మేలుజాతి గుర్రం కళ్ళాలైనా రౌతు చేతిలో ఉన్నంత వరకే మంచిది.
అప్పుడు ఏ ఐ ని రూపొందించిన వారంతా భస్మాసురులవుతారా? ఏమో? వారు మాత్రమే భస్మాసురులౌతారో, ప్రపంచాన్ని భస్మీపటలం చేస్తారో.
ఈ పరిస్థితినే సింపుల్ గా చూపించిన ఆంధ్రప్రభ సీనియర్ కార్టూనిస్ట్ మాధవ్ కార్టూన్ ఇది.
గత 2 దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.
