ఆంజనేయుడి ఆలయ పునర్నిర్మాణానికి రూ.51 వేల విరాళం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కోట్‌పల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సుందరి అనిల్ రూ.51,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సుందరి అనిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి స్థానిక నాయకులు, దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ మహేందర్, మాజీ సర్పంచ్ జ్ఞానేశ్వర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ అమర్నాథ్ పంతులు, కిరణ్, ప్రేమ్‌సేత్, సమ్మయ్య, విజయ్‌కుమార్, కృష్ణకుమార్, యాదగిరి, నర్సింలు, కృష్ణ, రమేష్, లక్ష్మీనారాయణ, కరీంపూర్ సర్పంచ్ సదత్ పటేల్, కొత్తపల్లి మాజీ సర్పంచ్ గొడ్డలి మల్లయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply