కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని ఊట్కూర్ తాసిల్దార్ చింతారవి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్ ఎం రేణుక భరత్ అధ్యక్షతన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నామనిఅన్నారు. ఊట్కూర్ మండలానికి 195 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. ఊట్కూర్ పట్టణానికి 42 చెక్కులు మంజూరు కాగా 26 కల్యాణ లక్ష్మి, 16 షాదీ ముబారక్ చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు.
ఆడపడుచు పెళ్లి చేసి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తరుణంలో ప్రభుత్వం పెళ్లికి కానుక కింద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని వృధా కాకుండా చూసుకోవాలని అన్నారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయనిఅన్నారు.
ఊట్కూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీలలో సర్పంచ్ లు, జి పి ఓ లు ప్రజాప్రతినిధులతో చెక్కులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, జిపిఓ హన్మంతు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోరంమహేష్ రెడ్డి, వార్డు సభ్యులు కొక్కు మల్లేష్, మాజీ ఎంపీటీసీ గోవిందప్ప, తదితరులు పాల్గొన్నారు.
