14 రోజుల రిమాండ్.. ఎందుకో తెలుసా..?

14 రోజుల రిమాండ్.. ఎందుకో తెలుసా..?

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గల ఎల్లంపల్లి అటవి ప్రాంతంలో అక్రమంగా చెట్టు నరికిన కోమటి చిన్నయ్య అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కోర్టు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎవరైనా అక్రమంగా అటవి సంపదకు నష్టం కలిగిస్తే వారికి కఠిన చర్యలు తప్పవని ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు హఫీజ్ ఉద్దీన్, డి ప్రకాష్, ఎఫ్బిఓ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply