Telangana | జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana | జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వచ్చే ఎన్నికల్లో రేవంత్‌కు ఓటమి తప్పదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఆయనతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి, ఇవాళ కేటీఆర్‌ను కలవబోతున్నానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే పదేళ్ల బీఆర్ఎస్ పాలనే ఎంతో మెరుగైనదని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Leave a Reply