చలివేంద్రంలో కుండలు ధ్వంసం..
చలివేంద్రంలో కుండలు ధ్వంసం..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : బిక్కనూరు మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తా వద్ద వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రంలోని కుండలను గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పట్టణానికి చెందిన 14వ వార్డు సభ్యులు జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, కౌసల్య దేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
వేసవి కాలంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడవద్దు అన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయానికి పలువురు అభినందించారు. అంతే కాకుండా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను కొందరు వ్యతిరేకిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుండలు ధ్వంసం చేసిన విషయాన్ని పలువురు, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే ఆయన అక్కడికి వెళ్లి ధ్వంసమైన కుండలను పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
