400 Tankers Struck : మ‌ళ్లీ హోర్ముజ్ బ్లాక్ Andhra Prabha News

400 Tankers Struck : మ‌ళ్లీ హోర్ముజ్ బ్లాక్ Andhra Prabha News

  • ఇరాన్ అక‌స్మిక నిర్ణ‌యం
  • ఒప్పందానికి ఇజ్రాయెల్ తూట్లు
  • లెబ‌నాన్ పై భీక‌ర దాడి
  • ఆగ్ర‌హంతో ఇరాన్ ఫైర్
  • 400 ట్యాంక‌ర్లు అడ్డ‌గింత

( ఆంధ్ర‌ప్ర‌భ‌, టెహ్రాన్ ప్ర‌తినిధి)

400 Tankers Struck : అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఇరాన్ మళ్ళీ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. లెబనాన్‌పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ ఎత్తున దాడులు చేసిందని ఇరాన్ ఆరోపించింది. “లెబనాన్‌పై దాడి అంటే ఇరాన్‌పై దాడి చేసినట్లే” అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించాయి. మెరికా-ఇరాన్ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్ పూర్తిగా నిలిపివేసింది. “అనుమతి లేకుండా ప్రవేశించే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తాం” అని ఇరాన్ నావికాదళం రేడియో సందేశాలను పంపింది. కేవలం రెండు నౌకలు మాత్రమే ఒప్పందం తర్వాత జలసంధిని దాటగా, ప్రస్తుతం 400 కంటే ఎక్కువ చమురు ట్యాంకర్లు అక్కడ నిలిచిపోయాయి. జలసంధి పునఃప్రారంభం అవుతుందనే వార్తతో తగ్గిన చమురు ధరలు, మళ్లీ మూసివేతతో అనిశ్చితికి లోనయ్యాయి. భారతదేశానికి వచ్చే చమురు మరియు సహజ వాయువులో సుమారు 40-50% ఈ జలసంధి నుండే వస్తుంది, కాబట్టి ఈ మూసివేత భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన తదుపరి శాంతి చర్చల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది

Leave a Reply