విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు

విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు
గీసుగొండ, ఆంధ్రప్రభ : ఈ వంచనగిరి క్రాస్ సమీపంలోని పిడిఆర్ గార్డెన్స్‌లో డివిజన్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ డివిజన్ డీఈ దానయ్య ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఈ గౌతం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు సూచనలు చేశారు. వరంగల్ ఎస్ ఈ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో నాణ్యత, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి నిర్వహణ విధానాలు, సురక్షా చర్యలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే అంశాలపై అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాల నివారణ, లైన్ మెయింటెనెన్స్ పనుల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఈ మల్లికార్జున్, ఏడీఈ రవి నాయక్, సబ్ డివిజన్ ఏఈలు, లైన్మెన్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
