TG | తానేదార్‌పల్లిలో అభివృద్ధి జోరు..!

TG | తానేదార్‌పల్లిలో అభివృద్ధి జోరు..!

-పేదల గూడు కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
-ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
-పైలట్ గ్రామంగా తానేదార్‌పల్లి ఎంపికతో 91ఇళ్ల మంజూరు
-ఒక్క గ్రామంలోనే రూ.4.55 కోట్లతో గృహ నిర్మాణాలు
-ఇళ్ల నిర్మాణంపై అధికారులు, సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి పెట్టాలి
-ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడమే నా తాపత్రయం
-ఎవరెన్ని విమర్శలు చేసిన..అభివృద్ధి మార్గమే మా దారి
-అభివృద్ధిని కొంతమంది అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు
-పనులు చేయని వారు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటు
-నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం
-స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

TG | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. తానేదార్‌పల్లిని పైలట్ గ్రామం గా ఎంపిక చేసి 91ఇళ్లను మంజూరు చేయగా, ఒక్క గ్రామంలోనే రూ.4.55 కోట్ల వ్యయంతో గృహ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మొ దటి విడత ఇళ్ల నిర్మాణాలను మే 31లోగా పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మా ణంపై అధికారులు, సర్పంచ్‌లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడమే తన లక్ష్యమని, ఎన్ని విమర్శలు వచ్చినా అభివృద్ధి మార్గంలోనే ముందుకు సాగుతాం. నాకున్న ఏకైక లక్ష్యం నియోజకవర్గ అభివృద్ధి మాత్రమేనని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేసారు. ఆదివారం మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లను ప్రారం భించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా నాయకులు బెలిదే వెంకన్న అధ్యక్షతన ఎమ్మెల్యే కడియం మాట్లాడారు.

-ఇందిరమ్మ ఇళ్లలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ముందంజ:

పేద ప్రజలు తమ స్వంత ఇంటి కళను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సాయంతో సాకారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 80శాతం ఇళ్ల నిర్మా ణం చేపట్టి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. నియోజకవర్గంలోనే అత్యధిక ఇందిరమ్మ ఇళ్లను తానే దార్ పల్లి గ్రామం లోనే మంజూరు చేసుకున్నాం. ఇది పేద ప్రజల పట్ల రాష్ట్ర ప్రభుత్వాని కి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కోన్నారు. పైలట్ ప్రాజెక్టు గా మీ గ్రామం ఎంపిక కావడానికి, ప్రభుత్వం పథకాలను తీసుకురావ డంలో గ్రామవాసి బెలిదే వెంకన్న చాలా కృషి చేసారని కొనియాడారు.

-రాష్ట్రవ్యాప్తంగా వేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు:

ఏ గ్రామానికి వెళ్లిన పదుల సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కనిపి స్తున్నాయని ఎమ్మెల్యే కడియం తెలిపారు. ప్రతీ లబ్ధిదారుని వద్దకు వెళ్లి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయా లని సర్పంచులు, అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22 ,5 00 కోట్ల వ్యయంతో 4 లక్షల 50వేల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, సన్నాలకు బోనస్, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని ఆయ న తెలి పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లన్నదే తన ఆలోచన అని ఎమ్మెల్యే పేర్కొన్నారు

-అభివృద్ధి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం:

ఘన్‌పూర్ రిజర్వాయర్ కింద 1లక్ష నుండి 10 లక్షల వరకు ఉన్న కాలు వలకు మరమ్మత్తులు చేపట్టి ప్రతి గ్రామానికి సాగు నీరు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో ఒకప్పుడు వలస వెళ్లే రైతులు తిరిగి వ్యవ సాయం వైపు మళ్లి, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రస్తుతం దాదాపు లక్ష ఎకరాల్లో వరి సా గు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరుగుతోందని వెల్లడించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి సాగు నీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనులు చేయించానని చెప్పారు. దాని ఫలితంగా నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి దేవాదు ల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు అందుతున్నాయని వివరించారు. అయితే కొంత మంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అవకాశం ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా పథకాలు, పదవులు అమ్ముకున్నవారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నా రని మండిపడ్డారు.

ఎవరెన్ని విమర్శలు చేసినా స్టేషన్ ఘన్‌ పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన నియోజకవర్గాలలో ఒకటిగా నిల బెట్టడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆస్సిసులతో రైతులు, పేదవారు సంతోషంగా ఉన్నారు. అదే విధంగా రెండవ విడతలో తమ గ్రామానికి మరో 30ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బెలిదే వెంకన్న కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమి టీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ హరిత ఇంద్రాసేనారెడ్డి, ఉప సర్పం చ్ గాదె శాంత భాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ దుంపల పద్మారెడ్డి, సర్పంచ్ లు పోలేపల్లి సంపత్ రెడ్డి, పనికర సోమయ్య, జోగు సంపత్ కుమార్, హౌసింగ్ ఏఈ అఖిల, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.