నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం ..

నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం ..

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు…
ముఖ్యమంత్రితో భేటీ అయిన కేంద్ర మంత్రి…
నేరడి పై ప్రత్యేక చర్చ…
నిర్మాణానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి…

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేరడి ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ ను రామ్మోహన్ నాయుడు అందజేసి అందులోని వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ భేటీలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ నుండి ఇటీవల విడుదలైన నేరడి ప్రాజెక్టుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ ఒక చరిత్రాత్మక ఘట్టంగా రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఈ మేరకు పత్రికా ప్రకటన మంగళవారం రాత్రి విడుదల చేసారు. దశాబ్దాలుగా ఈ సమస్యపై పోరాటం చేస్తున్న శ్రీకాకుళం ప్రజలకు, ముఖ్యంగా సాగునీటి, నీటి భద్రత కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది గొప్ప శుభవార్తగా నిలిచిందని అన్నారు. నేరడి ప్రాజెక్టు డబుల్ ఇంజన్ సర్కార్ మద్దతుతో ఇప్పుడు నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఉండటం ఆనందంగా ఉందని అన్నారు.

భేటీలో నోటిఫికేషన్ కు అనుగుణంగా ఏర్పడిన సవరణలు, మిగులు జలాల లెక్కలు, నేరడి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, భవిష్యత్ విప్లవాలను రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రికు వివరించారు. ఈ సంధర్భంగా నేరడి ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకొని త్వరగా పూర్తి చేసి, ప్రజలకు ప్రయోజనాలు అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారనీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్టు కేవలం మౌలిక సదుపాయ పథకం మాత్రమే కాకుండా, శ్రీకాకుళం జిల్లాను సమృద్ధి, స్థిరత్వం కలిగిన ప్రాంతంగా మార్చే జీవనాధారమని, వ్యవసాయాన్ని బలోపేతం చేస్తూ జీవనోపాధులను మెరుగుపరచి రైతుల భవిష్యత్తును భద్రపరుస్తుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు..

Leave a Reply