dd vs gt| గెలుపెవ‌రిదో?

dd vs gt| గెలుపెవ‌రిదో?

ఢిల్లీ వ‌ర్సెస్ గుజ‌రాత్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో ఇవాళ (బుధ‌వారం) బిగ్‌ఫైట్ జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఢీకొన‌నున్నాయి. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచులోనైనా బోణీ కొట్టాల‌ని చూస్తోంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్ స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్‌లో వీక్షించొచ్చు.

హోం గ్రౌండ్ వేదికగా ముంబైని చిత్తు చేసిన ఢిల్లీ, ఇప్పుడు గుజరాత్ భరతం కూడా పట్టాలని అనుకుంటోంది. గుజరాత్ టైటాన్స్ రెండు మ్యాచ్‌లలోనూ ఆఖర్లో బోల్తాకొట్టింది. ఈ మ్యాచులోనైనా విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం చూపనుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ, ఎన్‌సిఆర్ ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షం, ఈ మ్యాచ్‌పై కూడా ప్రభావం చూపవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
అక్షర్ పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, పాతుమ్ నిస్సాంక, సాహిల్ పరాఖ్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, ఆఖిబ్ స్టార్, నిష్తరాజన్, ఆకిబ్ దార్, ఆఖీబ్ దార్, నిట్ష్‌రాజన్. కుమార్, దుష్మంత చమీరా, లుంగిసాని ఎన్గిడి, కైల్ జేమిసన్, కుల్దీప్ యాదవ్.

గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ , మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, జాసన్ హోల్డర్, మన్‌వత్‌ కుమార్, జయంత్‌వత్ కుమార్, జయంత్ హోల్డర్. సాయి కిషోర్, ఇషాంత్ శర్మ, ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, నిశాంత్ సింధు.

Leave a Reply