ఇన్చార్జి వైద్యులుగా బాధ్యతలు చేపట్టిన తరుణ్..

ఇన్చార్జి వైద్యులుగా బాధ్యతలు చేపట్టిన తరుణ్..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రంలోని ఇన్చార్జి వైద్యులుగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని ప్రభుత్వ ప్రాథమిక మొబైల్ వైద్యులు తరుణ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యులు తరుణ్ మాట్లాడుతూ.. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని నిరుపేద ప్రజలు రోగులకు వైద్యసేవలు అందించడం తమ వంతుగా కృషి చేస్తానని తెలిపారు. పవిత్రమైన వైద్యవృత్తికి ఎలాంటి మచ్చ రాకుండా నిరంతరాయంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అన్నారు. తమకు ఉన్న విలువైన సమయాన్ని వెచ్చిస్తు, శాయశక్తుల, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందించేందుకు తాను అహర్నిశలుగా కృషిచేస్తానన్నారు.
మండల వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు తమవంతుగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఫార్మసిస్ట్ మురళి, డీఈఓ నాగేశ్వరరావు, స్టాప్ నర్స్ సునీత, హెల్త్ అసిస్టెంట్స్ శ్రీధర్ బాబు, నరేష్, ఏఎన్ఎంలు సుగుణ, సావిత్రి, రమణ, ఎల్టి పార్వతి, ఎంఎల్ హెచ్పి రేవతి, మాలు సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ఘన సన్మానం చేశారు.
