గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ గొప్ప సంఘసంస్కర్త అని దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఊట్కూర్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొక్కుశంకర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం. భరత్, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్, ఆయా సంఘాల నాయకులు నర్సింగప్ప, జయరాములు, నారాయణ, దశరథ్ అన్నారు.
ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలువేసిఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ప్రధానిగా కేంద్ర మంత్రిగా దేశానికి జగ్జీవన్ రామ్ ఎన్నో సేవలు చేశారని ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
దేశ స్వాతంత్రం కోసం సామాజిక సమానత్వం బడుగు బలహీన వర్గాల నేతగా ఎన్నో పోరాటాలు చేసి నమ్మిన సిద్ధాంతం కోసం దేశంలో దళితుల అభ్యున్నతికి రాజకీయంలో సంకీర్ణ ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు.
బాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితో ప్రతి యువకుడు ముందుకు సాగుతూ పోరాటపటిమను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు తిమ్మప్ప, కొండన్ భరత్, సురేష్ కొక్కు నరసింహులు, బలరాం, తిమ్మప్ప, రూప లక్ష్మణ్ ,నరేష్,రవి, అశోక్ రఘువీర్ నాగరాజు రఘు తదితరులు పాల్గొన్నారు.
