వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి

వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండలంలోని వరి కోతకు వస్తున్న సమయంలో మండలంలో కొనుగోలు కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేయాలని రైతు చెరుకు శ్రీరామ్ గౌడ్ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత వానాకాలం సీజన్లో రైతులు వరి పంటను కోసి కుప్పలు పోసిన తర్వాత కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్లన రైతులు కుప్పలు పోసి ఆరబెట్టి ధాన్యాన్ని చాలా రోజులు నిల్వ ఉంచి చాలా నష్టపోయారని కావున అధికారులు కోతలకు ముందే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంటే రైతులకు ఏలాంటి నష్టపోకుండా ధాన్యాన్ని ఆరబెట్టుకొని అమ్మడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేశారు. రైతులకు సరిపడా తాల్పిన్ కవర్లు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నల్ల చంద్రశేఖర్ గౌడ్, బట్టు చంద్రశేఖర్, అశ్వక్, ఆమంచా రమేష్, బోయపల్లి శ్రీరాములుz వీరమల్ల గణేష్, నల్ల మధు పాల్గొన్నారు.
