ఘనంగా స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత బాంధవుడు, సమతావాది, సంఘసంస్కర్తగా పేరుగాంచిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్ మడికొండ శ్రీను, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

అలాగే పరకాల మున్సిపల్ కౌన్సిలర్లు బొచ్చు మాధవిలత జాన్సన్, పాలకుర్తి శ్రీనివాస్, నాయకులు మంద శ్యామ్, బొచ్చు రవికుమార్, కైలాసకోటి రవీందర్, అల్లూరి నరేష్, మడికొండ రవి, రామూర్తి, రాకేష్, జూపాక దేవమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply