అనారోగ్యంతో ఆదివాసి మహిళ మృతి

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని రాసిమెట్ట గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ కురుసంగ శకుంతల (38) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆమె బంధువులు తెలిపారు.

శకుంతల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శరీరమంతా వాపుతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఆమెకు చికిత్సలు చేయించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని బంధువులు తెలిపారు.