గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్…

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : దళితుల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని స్టేషన్ ఘన్ పూర్ మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు తాటికొండ సురేష్ కుమార్పే ర్కొన్నారు. ఆదివారం స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్క ర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీ వన్ రామ్ జయంతి వేడుకలను మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కనకం గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు తాటికొండ సురేష్ కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా పట్టణ కేంద్రం లోని పోలీస్ స్టేషన్ ఆవరణలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి బిఆర్ ఎస్ నాయకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళుల ర్పించారు.ఈ సందర్బంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ.. జగ్జీవన్‌ రామ్‌ జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత సమాజ అభి వృద్ధికి కృషి చేయాలన్నారు.

బీహార్ లోని వెనుకబడిన వర్గాల నుండి వచ్చిన జగ్జీవన్ రామ్ భారత పార్లమెంటులో 40 ఏండ్ల పాటు వివిధ మంత్రి పదవులను నిర్వహించడమే కాకుండా ఉప ప్రధా నిగా దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఒకటోవ వార్డు కౌన్సిలర్ తాటికొండ మధు, ఐదోవ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య రఘు రెడ్డి, ఆరోవ వార్డు కౌన్సిలర్ బాలగాని అనిల్, బిఆర్ఎస్ నాయకులు గుర్రపు శంకర్, మారేపల్లి ప్రసాద్, గుండె మల్లేష్, చింత శ్రీనివాస్, ఆకా రప్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply