12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష

12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేష్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి అనుమతి మేరకు తెలంగాణ రాష్ట్ర రిఫరీ బోర్డు సౌజన్యంతో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్షను నిజామాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు ఆంద్యాల లింగయ్య, కార్యదర్శి కోమటిరెడ్డి గంగాధర్ రెడ్డి తెలిపారు.
ఈ పరీక్ష ఈనెల 12వ తేదీ ఆదివారం నగరంలోని సుభాష్ నగర్‌లో గల విజ్ఞాన్ హై స్కూల్‌లో నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రిఫరీ బోర్డు చైర్మన్ అనిల్ కుమార్ బృందం, నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. పరీక్షలో పాల్గొనదలచిన అభ్యర్థులు రూ.1000 పరీక్ష ఫీజును ఈనెల 8వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు.
పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, విజిల్ వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షలో పాల్గొనే అభ్యర్థులందరికీ జిల్లా కబడ్డీ సంఘం తరఫున భోజన వసతి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఫోన్‌పే నెంబర్: 8341867430 (జ్యోతి, పీడీ ఎర్గట్ల) మరిన్ని వివరాలకు : గంగాధర్ రెడ్డి (సెక్రటరీ) – 9989814410, కబడ్డీ ప్రశాంత్ – 9866770889 సంప్రదించాలని కోరారు.
జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి రిఫరీ పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి పిలుపునిచ్చారు.
