టౌన్ ప్రెసిడెంట్ కు సన్మానం

టౌన్ ప్రెసిడెంట్ కు సన్మానం
భీమ్‌గల్ టౌన్ , (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ భీంగల్ టౌన్ ప్రెసిడెంట్ గా నియామకం అయిన పర్శ అనంత్ రావును సన్మానం చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోదిరే స్వామి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు కోరాడి రాజు టౌన్ ప్రెసిడెంట్ ను పూల మాల, శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్బంగా టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. భీంగల్ టౌన్ లో అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారికీ అందేలా సహకరిస్తానని పేర్కొన్నారు.
