Aditya Birla | తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్..
Aditya Birla | తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్..
- నిజామాబాద్‌లో కొత్త బ్రాంచ్
- లాంచ్ ఆఫర్ జీరో లాగిన్ ఫీజు, ₹50 లక్షల వరకు స్పాట్ లోన్ మంజూరు
నిజామాబాద్, తెలంగాణ: ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబీహెచ్‌ఎఫ్ఎల్), దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించే ప్రణాళికలో భాగంగా నిజామాబాద్‌లో కొత్త శాఖను ప్రారంభించింది.
దాంతో తెలంగాణలో సంస్థ ఉనికిని మరింత పటిష్టం చేసుకుంటూ, ఈ ప్రాంతంలో తన మొత్తం బ్రాంచ్‌ల సంఖ్యను 9కి పెంచుకుంది. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసింది. పటిష్టమైన వ్యవసాయం, ఎన్‌హెచ్-44 కారిడార్ వెంబడి మెరుగుపడుతున్న రహదారి కనెక్టివిటీ, నిజామాబాద్ మాస్టర్ ప్లాన్ 2041 కింద ప్రణాళికాబద్ధమైన పట్టణ ప్రాంత విస్తరణ దన్నుతో తెలంగాణలో నిజామాబాద్ కీలకమైన హౌసింగ్ మార్కెట్‌గా ఎదుగుతోంది.
పెరుగుతున్న పట్టణీకరణ, మధ్యతరగతి కుటుంబాల ఆకాంక్షలతో వేతనజీవులు, స్వయం ఉపాధి పొందుతున్న కస్టమర్లలో అందుబాటు ధరల్లో ఇళ్లు, హౌసింగ్ ఫైనాన్స్ ప్రోడక్టులకు డిమాండ్ పెరుగుతోంది. గృహాల కొనుగోలు, నిర్మాణం, మెరుగుదలల కోసం కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన రుణ సాధనాలను అందించేందుకు ఈ కొత్త ఏబీహెచ్ఎఫ్ఎల్ శాఖ తోడ్పడనుంది.
వేతన ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులు, వ్యాపారస్తులు మరియు ఎదుగుతున్న ఆదాయ వర్గాల వంటి వివిధ రకాల కస్టమర్ల అవసరాలకు సరిపోయేలా ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ విభిన్నమైన గృహ రుణ సేవలను అందిస్తోంది. ఇందులో అఫోర్డబుల్ హౌసింగ్ లోన్స్, ప్రైమ్ హౌసింగ్, కన్స్ట్రక్షన్ ఫైనాన్స్, మరియు ఆస్తిపై రుణాలు ఉన్నాయి. పటిష్టమైన డిజిటల్ వ్యవస్థ సహాయంతో, కస్టమర్లకు సులభమైన ఆన్‌బోర్డింగ్, వేగవంతమైన లోన్ అప్రూవల్స్ మరియు పారదర్శకతను అందిస్తూ కంపెనీ అత్యుత్తమ సేవా అనుభవాన్ని అందిస్తోంది.
ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా, 2026 జూన్ 3 నుండి జూన్ 30 వరకు కస్టమర్లకు సంస్థ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎటువంటి లాగిన్ ఫీజు లేకుండా, రూ. 50 లక్షల వరకు రుణాలను తక్షణం మంజూరు చేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో రుణాలను పొందే అవకాశం ఉంటుంది.
ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ Mr. పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ.. “తెలంగాణ మాకు అత్యంత కీలకమైన వృద్ధి మార్కెట్. పటిష్టమైన డిమాండ్, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు మరింత చేరువ కావడానికి ప్రాంతీయంగా మా కార్యకలాపాలను విస్తరిస్తున్నాము. మా విస్తృతమైన బ్రాంచ్ నెట్‌వర్క్‌ను, అధునాతన డిజిటల్ సాంకేతికతతో జోడించి, కస్టమర్ల సొంతింటి కలను మరింత సరళంగా, వేగంగా మరియు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాకారం చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
తమ కస్టమర్లకు ‘హ్యాపీ హోమ్ లోన్ జర్నీ’ (ఆనందకరమైన గృహ రుణ ప్రస్థానం) అందిస్తామనే వాగ్దానానికి కట్టుబడి, బాధ్యతాయుతమైన విధంగా రుణాల పంపిణీ నిర్వహించడం మరియు ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడంపై ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నిరంతరం దృష్టి సారిస్తోందనడానికి కార్యకలాపాల విస్తరణ నిదర్శనంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం దయచేసి సందర్శించండి — https://homefinance.adityabirlacapital.com/
